Breaking : హెటిరో కు షాక్ ఇచ్చిన రేవంత్
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో పార్థసారధికి గత ప్రభుత్వం కేటాయించిన భూములపై జీవోను నిలుపుదల చేసింది
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హెటిరో పార్థసారధికి గత ప్రభుత్వం కేటాయించిన భూములపై జీవోను నిలుపుదల చేయాలని నిర్ణయించింది. హెటిరో అధినేత పార్ధసారధి రెడ్డికి గత ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉతర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో పదిహేను ఎకరాల భూమిని కేటాయించింది. ఈ భూముల విలువ వందల కోట్ల రూపాయలలోనే ఉంటుందని చెబుతున్నారు.
జీవోను నిలిపేస్తూ...
జీవో 140ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. సింధు ఫౌండేషన్, క్యాన్సర్ మందు పరిశోధనకోసంఈ భూములను కేటాయించింది. పదిహేను ఎకరాల భూమిని ముప్ఫయి ఏళ్లలీజుకు కేటాయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విలువైన భూములను అప్పనంగా పంచిపెట్టారని, కొందరికి తమ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన వారికి తక్కువ మొత్తానికి లీజుకు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత జీవోను నిలిపేయాలని నిర్ణయించడం సంచలనంగా మారింది.