తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల... గుడ్ న్యూస్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టెట్ షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 2వ తేదీ నుంచి 20వతేదీ వరకు టెట్ ని నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాడైరెక్టర్ ప్రకటించారు. టెట్ షెడ్యూల్ ప్రకారం ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విడతలుగా పరీక్షలను నిర్వహించనున్నారు.
రెండు విడతలుగా...
ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకూ ఒక విడతలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు పరీక్ష జరుగుతుందని పాఠశాల విద్యా డైరెక్టర్ తెలిపారు. ఈ టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయ పోస్టులకు నిర్వహించే పరీక్షలకు అర్హులు కావడంతో పెద్దయెత్తున పోటీ ఉండే అవకాశముందని విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేస్తుంది.