ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన తమిళి సై

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2022-09-08 08:28 GMT

తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏ విషయంలోనూ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కొన్ని విషయాలు బయటకు చెప్పకపోవడమే మంచిదని ఆమె అన్నారు. రాజభవన్ ను అంటరానితనంగా చూస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ లో ఎందుకు అడుగుపెట్టడం లేదన్నారు. సేవారంగంలో పనిచేసిన వారికే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అన్నారు. ఆ కోటలో కౌశిక్ రెడ్డి కరెక్ట్ కాదనే తాను తిరస్కరించానని ఆమె తెలిపారు. రాజభవన్ అంటే రెస్సెక్ట్ లేదు.. రెస్పాన్స్ లేదని తమిళిసై తెలిపారు. రాజ్ భవన్ ప్రజావేదికగా మారిందన్నారు. తాను పంపుతున్న సమస్యలను పట్ల కూడా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. సెప్టంబరు 17న విమోచన దినం జరపడమే కరెక్ట్ అని ఆమె అన్నారు.

స్పందించడం లేదు...
బాసర ట్రిపుల్ ఐటీ లో సమస్యలు చూసి తాను చలించిపోయానని అన్నారు. తాను ఎక్కడకి వెళ్లినా ప్రొటోకాల్ పాటించడం లేదని తమిళి సై విమర్శించారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ధ్వేషం లేదన్నారు. సదరన్ కౌన్సిల్ భేటీలో అవకాశం ఉన్నా తెలంగాణ సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు. ప్రజల్ని తాను కలవాలనుకున్న ప్రతిసారీ ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారంటున్న వారు సీఎంను రాజకీయాలు చేస్తున్నారని ఎందుకు ప్రశ్నించరని ఆమె నిలదీశారు. తనకు గౌరవం ఇవ్వకపోతే తానేం తక్కువకానని అన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన పని తాను చేసుకుంటానని చెప్పారు. జరుగుతున్న వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు. గవర్నర్ పై ఎందుకింత వివక్ష అని ఆమె ప్రశ్నించారు. ఏ విషయంలోనూ తనకు ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడం లేదన్నారు. నిద్రపోతున్నట్లు నటించేవాళ్లను లేపలేమని ఆమె అభిప్రాయపడ్డారు.


Tags:    

Similar News