మూడు స్థానాలకు గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడి దరఖాస్తు

తెలంగాణలో ఎన్నికల ఊపు కనిపిస్తూ ఉంది. ఓ వైపు బీఆర్ఎస్ లో సీట్ల రగడ మొదలవ్వగా

Update: 2023-08-24 05:06 GMT

తెలంగాణలో ఎన్నికల ఊపు కనిపిస్తూ ఉంది. ఓ వైపు బీఆర్ఎస్ లో సీట్ల రగడ మొదలవ్వగా.. కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల సందడి కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గల్ఫ్ విభాగం అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం బుధవారం సాయంత్రం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. గల్ఫ్ కార్మిక కుటుంబాలు ఎక్కువగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, వేములవాడ మూడు స్థానాలకు దరఖాస్తు చేశారు. ఈ మూడు స్థానాలలో ఏదైనా ఒక టికెట్ తనకు గల్ఫ్ కోటాలో ఇవ్వాలని కోరారు.

నరేష్ రెడ్డి మాట్లాడుతూ 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు, 15 లక్షల మంది గల్ఫ్ రిటర్నీలు, గల్ఫ్ కార్మిక కుటుంబ సభ్యులు కలిసి తెలంగాణలో ఒక కోటి మంది ఓటు బ్యాంకు ఉందని అన్నారు. గల్ఫ్ కార్మికుల ప్రతినిధిగా ఎమ్మెల్యేగా గెలిచే సత్తా తనకు ఉందని, ప్రత్యర్థులకు ధీటుగా ఎదుర్కొంటానని నరేష్ రెడ్డి అన్నారు. గల్ఫ్ లో ఎన్నో కష్టాలు పడుతున్న వాళ్లను ఆదుకున్న చరిత్ర సింగిరెడ్డి నరేష్ రెడ్డిది. ఎంతో మంది సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి కావడంతో నరేష్ రెడ్డికి ప్రజలలో మద్దతు కూడా ఉంది.


Tags:    

Similar News