BRS : బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుందా? ఈ భేటీ వెనుక అదే కారణమా?

గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి సలహాదారు వేం నరేంద్ర రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

Update: 2024-03-12 07:47 GMT

తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుంది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద్ర రెడ్డిని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రెండురోజుల్లోనే అమిత్ రెడ్డి పార్టీ మారతారంటూ ఊహాగానాలు పెద్దయెత్తున వినిపిస్తున్నాయి. ఆయన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా బీఆర్ఎస్ నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతోనే బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

భువనగిరి నుంచి...
ఆయన తనకు భువనగిరి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వాన్ని కోరనున్నారని చెబుతున్నారు. బీఆర్ఎస్ లో నల్లగొండ నుంచి పోటీ చేయాలని అమిత్ రెడ్డి భావించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా అమిత్ రెడ్డికి టిక్కెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ అక్కడ వేరే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని తెలియడంతో అమిత్ రెడ్డి పార్టీని వీడే అవకాశాలున్నాయని తెలిసింది. ముందుగా వేం నరేందర్ రెడ్డిని కలిసి తర్వాత ముఖ్యమంత్రి వద్దకు వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగలనుంది.


Tags:    

Similar News