Harish Rao: హై డ్రామా తర్వాత హరీష్ రావు విడుదల
కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు దాడి చేశారంటూ బీఆర్ఎస్ నేతలు హైదరాబాదులో పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించారు. అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన చేపట్టారు. దాంతో పోలీసులు హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీసు వాహనాల్లో తరలించారు. పోలీస్ వాహనాలను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. చివరికి కేశంపేట పోలీసు స్టేషన్ కు బీఆర్ఎస్ నేతలను తరలించారు.
కేశంపేట మండలం కేంద్రంలో మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులను అరెస్టు చేశారు. మంత్రి హరీష్ రావు బృందాన్ని పోలీసులు రాత్రి 11 గంటల తర్వాత వదిలేశారు. దీంతో వారంతా తమ వాహనాల్లో వెళ్లిపోయారు. తనను అరెస్ట్ చేసిన సమాచారాన్ని తెలుసుకొని తమకు అండగా నిలిచిన టిఆర్ఎస్ శ్రేణులకు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులను ఆయన ధన్యవాదాలు తెలిపారు.