Tspsc : నేడు హైకోర్టులో విచారణ

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

Update: 2023-04-11 05:54 GMT

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్ఎస్‌యూఐ నేత బలమురి వెంకట్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. టీఎస్పీఎస్సీ కేస్ లో మూడు వారాల పాటు జరిపిన దర్యాప్తు నివేదికను ఈరోజు సిట్ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. నేడు కౌంటర్ అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేయనుంది.

రాజకీయ దురుద్దేశంతోనే...
గతంలో వ్యాపం కేసును సుప్రీంకోర్టు సీబీఐ కి అప్పగించిందని పిటిషనర్ తరుపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసును కూడా సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ తరుపున న్యాయవాదులు కోరారు. ఈ పిటిషన్ రాజకీయ దురుద్దేశంతోనే వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వొకేట్ జనరల్ వాదించారు. సిట్ దర్యాప్తు రిపోర్టును నేడు పరిశీలించి హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోంది.


Tags:    

Similar News