చితి పేర్చుకుని వృద్ధుడి ఆత్మహత్య

మానవ సంబంధాలు మంట గలసి పోతున్నాయి. కొడుకులు తనను పోషించడానికి పంచుకోవడంతో మనస్థాపం చెందిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు;

Update: 2023-05-05 05:04 GMT
venkataiah, siddipet, sucide
  • whatsapp icon

మానవ సంబంధాలు మంట గలసి పోతున్నాయి. కొడుకులు తనను పోషించడానికి పంచుకోవడంతో మనస్థాపం చెందిన వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి తల్లడిల్లిపోయింది. కని పెంచిన కొడుకులే తనను వంతుల వారీగా పంచుకోవడం మనస్థాపానికి గురి చేసింది. తనను పోషించడానికి వారు వంతుల వారీగా పంచుకోవడంతో ఆ పెద్దాయన తీవ్రంగా మధనపడ్డాడు. తన కుమారులకు అవసరం లేని తాను ఇక ఉండకూడదనుకున్నాడో ఏమో.. తనంతట తానే చితి పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిద్ధిపేట జిల్లాలో ఈ దారుణం జరిగింది. 90 ఏళ్ల వెంకటయ్య ఆత్మహత్య చేసుకోవడం కలచి వేసింది.

ఇద్దరు కొడుకులు...
వెంకటయ్య తన ఇద్దరు కొడుకులకు నాలుగు ఎకరాలు పంచేశాడు. ఆయన వద్ద ఇక ఏమీ లేదు. భార్య కూడా మరణించింది. కొడుకులిద్దరూ తండ్రిని చెరి కొంత కాలం ఉంచుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. పెద్ద కొడుకు తన స్వగ్రామమైన ముస్తాబాద్‌లోనూ, మరొకరు కరీంనగర్ జిల్లాలోనూ ఉంటున్నారు. అయితే పెద్దకొడుకు ఇంటి నుంచి చిన్న కొడుకు ఇంటికి వెళ్లేందుకు సమయం వచ్చింది. ఇది ఇష్టంలేని వెంకటయ్య తనకు తానే చితిని పేర్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News