Rain Alert : కుండపోతగా మూడు రోజులు భారీ వర్షాలు... ఆరెంజ్ అలెర్ట్ జారీ

హైదరాబాద్ వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది

Update: 2024-07-17 02:12 GMT

హైదరాబాద్ వాతావరణ శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఐదు రోజుల పాలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రధానంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలు భారీ వర్షాల దెబ్బకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దాదాపు కొన్ని జిల్లాల్లో ఇరవై సెంటీ మీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. దీంతో పాటు ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని పేర్కొంది. చెట్లు విరిగిపడతాయని, విద్యుత్తు స్థంభాలు నేలకొరిగే అవకాశముందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈదురుగాలులు....
రేపు కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ బాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడతాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎక్కువ వర్షపాతం నమోదయితే నీళ్లు చేరే అవకాశముందని తెలిపింది.
పురాతన భవనాల్లో....
దీంతో పాటు పురాతన భవనాల్లో నివసించే వారు కూడా ఖాళీ చేయడం మంచిదని మున్సిపల్ అధికారులు సూచిస్తున్నారు. మట్టి ఇళ్లు, పురాతన భవనాలు కూలిపోయే అవకాశముందని, అందుకే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున రైతుల, పశువుల కాపర్లు చెట్లు, విద్యుత్తు స్థంభాల కింద ఉండకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పశుసంపదను కూడా రక్షించుకోవడానికి సురక్షితమైన మార్గాలను ఎంచుకోవాలని తెలిపింది.


Tags:    

Similar News