Telangana : తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలే

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Update: 2024-06-19 02:08 GMT

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తులో రాయలసీమ ప్రాంతంలో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈదురుగాలులతో...
భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది. గంటలకు ముప్పయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హన్మకొంద, కుమరం భీం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్ నగరంలో కూడా రాత్రికి వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News