Telangana : ఏపీకి వెళ్లలేం.. తెలంగాణలోనే కొనసాగుతాం

తాము తెలంగాణలోనే కొనసాగుతామని, ఏపీకి వెళ్లమని ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు;

Update: 2024-10-14 12:26 GMT
ias officers, CAT,  telangana, andhra pradesh, ias officers approached CAT to stay in telangana and go to andhra pradesh, ias officer latest news today telugu

ias officers 

  • whatsapp icon

తాము తెలంగాణలోనే కొనసాగుతామని, ఏపీకి వెళ్లమని ఐఏఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదకొండు మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను తమ సొంత రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.

క్యాట్ ను ఆశ్రయించిన ఐఏఎస్‌లు...
క్యాట్ లో పిటీషన్ ను దాఖలు చేసి తాము తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. డీవోపీటీ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేయాని పిటీషన్ లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ముగ్గురు ఐఏఎస్ లు క్యాట్‌ను ఆశ్రయించారు. వీరిలో ఐఏఎస్ అధికారులు ఆమ్రాపాలి, వాణి ప్రసాద్, వాకాటి కరుణలు ఉన్నారు. రేపు ఈ పిటీషన్లపై క్యాట్ లో విచారణ జరగనుంది. అలాగే తాము ఏపీలోనే కొనసాగుతామని అక్కడ ఐఏఎస్ లు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరినట్లు తెలిసింది.


Tags:    

Similar News