Breaking: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఐఏఎస్‌ల బదిలీలు

తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత కీలక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో

Update: 2023-12-24 12:31 GMT

Telangana IAS Transfers

Telangana IAS Transfers: తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత కీలక అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే వివిధ శాఖల్లో అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పోలీసు వ్యవస్థలో ఎన్నో బదిలీలు, మార్పులు తీసుకువస్తుండగా, తాజాగా రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ (IAS)అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- రవాణాశాఖ కమిషనర్‌గా జ్యోతిబుద్ధప్రకాశ్‌

- ఎక్సైజ్‌ శాఖ కమినర్‌గా శ్రీధర్‌

- గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా ఈవీ నర్సింహారెడ్డి

- ఇంటర్‌ విద్య డైరెక్టర్‌గా శృతిఓజా

- రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా భారతి హొలికేరి బదిలీ కాగా, జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని భారతి హొలికేరికి ఆదేశాలు జారీ అయ్యాయి.

- రంగారెడ్డి కలెక్టర్‌గా గౌతమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. అలాగే టీఎస్‌ సివిల్‌ సప్లై కమిషన్‌గా హౌహాన్‌ నియామకం అయ్యారు.


Tags:    

Similar News