టీఆర్ఎస్ కు మూడు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు మూడు ఏకగ్రీవం అయ్యాయి.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు మూడు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, మూడు స్థానాలు అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. నిజామాబాద్ లో ఒకటి, రంగారెడ్డి జిల్లాల్లో రెండు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ లు పోటీ చేయకపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక పరంగా అధికారులు తిరస్కరించడంతో మూడు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
కవితతో పాటు...
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కేసీఆర్ కుమార్తె కవిత, రంగారెడ్డి జిల్లాలో శంభీపూర్ రాజు, పట్నం మహీందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు అధికారులు ప్రకటించారు. 12 స్థానాల్లో 99 నామినేషన్లను దాఖలు చేయగా 24 నామినేషన్లను అధికారులు వివిధ కారణాలతో తిరస్కరించారు.