Ponguleti : పొంగులేటి చెప్పినట్లుగానే... ఆయన ఇంటిపై ఐటీ దాడులు

కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు

Update: 2023-11-09 02:26 GMT

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జామున వచ్చిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలను నిర్వహిస్తున్నారు. పొంగులేటి ఇంట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఇంట్లో సిబ్బంది ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఎనిమిది వాహనాల్లో వచ్చిన అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఈరోజు పాలేరులో నామినేషన్ వేయనున్న సందర్భంలో ఈ దాడులు జరుగుతుండటం విశేషం.

ఏకకాలంలో...
ఎన్నికలు జరుగుతున్న సమయంలో పెద్దయెత్తున నగదును నిల్వ ఉంచారన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లోని పొంగులేటి నివాసంతో పాటు రాఘవ కన్స్ట్రక్షన్స్ లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోని ఆయన ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు జరుగుుతన్నాయి. రెండు రోజుల క్రితమే తన ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లపై సోదాలు జరుగుతాయని మీడియాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల వేళ ఈ దాడులు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.


Tags:    

Similar News