ఫీనిక్స్ కంపెనీపై ఐటీ దాడులు.. రాజకీయ నేతల పెట్టుబడులు
హైదరాబాద్ లో ఫీనిక్స్ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ లో ఫీనిక్స్ కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 25 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు. మొత్తం 20 చోట్ల ఫీనిక్స్ కంపెనీ కార్యాలయాలు, దాని డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 250 మంది ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 150 మంది వరకూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఏకకాలంలో ఇరవై చోట్ల....
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న ఫీనెక్స్ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక మంది రాజకీయ నాయకులు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. కొన్ని కీలకమైన అగ్రిమెంట్లు, ప్లాట్ల కొనుగోలుదారులకు సంబంధించిన వివరాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. కొన్ని కీలక ఆధారాలతో పాటు కొంత నగదును కూడా ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రానికి ఈ దాడుల వివరాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెల్లడించే అవకాశముంది.