సోషల్ స్టార్టప్ ఎక్స్‌పోను ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దయార గ్రామంలో ప్రతిష్ఠాత్మకంగా

Update: 2024-01-28 13:30 GMT

మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దయార గ్రామంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బాలవికాస- తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్‌ సెల్ (TSIC) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి డి.శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో కొత్త ఎంఎస్‌ఎంఇ పాలసీని తీసుకురాబోతోందని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు రాజధానిగా మార్చే లక్ష్యంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. వీటిని ప్రోత్సహించడానికి టీహబ్‌, వీహబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో బాలవికాస స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమని, స్టార్టప్‌ల ప్రోత్సాహానికి బాలవికాస చేపడుతున్న ఈ ఎక్స్‌పో ఎంతో మేలుచేస్తుందని ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

రాష్ట్రంలో సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మరింత అభివృద్ధి చెందాలని శ్రీధర్ బాబు సూచించారు. వీటిని ప్రోత్సహించడానికి టీహబ్‌, వీహబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పదిమందికి ఉపయోగపడే వినూత్న ఆలోచనతో వస్తే రాష్ట్రప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. బాలవికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) ప్రాంగణంలో దేశ వ్యాప్తంగా సుమారు 700 మంది సామాజిక వ్యాపార వేత్తలు, ఇంపాక్ట్ ఇన్వెస్టర్లు మరియు పలు వ్యాపార రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 70కి పైగా సామాజిక వ్యవస్థాపకులు తమ సామాజిక వ్యాపార ఉత్పత్తులను సోషల్ స్టార్టప్ ఎక్స్‌ పో లో ఆవిష్కరించారు. సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ – ఇంపల్స్ 2024, బాల వికాస సెంటర్ ఫర్ సోషల్ అండ్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (CSRB) వార్షిక ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC) భాగస్వామ్యంతో నిర్వహించారు. కీసరలోని బాల వికాస్ క్యాంపస్‌లో 500 మందికి పైగా సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాక్టీషనర్లు, ఔత్సాహికులు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్ఫూర్తిని జరుపుకోవడానికి, సెక్టార్‌ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు.


Tags:    

Similar News