పార్ట్ టైం జాబ్ ఆఫర్
ఓ బాధితుడికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. అది చూసిన ఓ బాధితులు లక్షల్లో డబ్బులు పెట్టి కోల్పోయాడు. దీంతో బాధితుడు లబోదిబోమంటూ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగా తీగ లాగితే డొంక మొత్తం కదిలి వచ్చింది. ఈ కేసులో సైబర్ ట్యూటర్స్ చైనా ను కేంద్రంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఓ ఫోన్ నెంబర్ ఆధారంగా మొత్తం కుప్పి లాగి 9 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మాట్లాడారు. చైనా కేంద్రంగా చేసుకుని పెట్టుబడులు పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చిందని.. చిక్కడపల్లి కి చెందిన ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠాను పట్టుకున్నామని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ వెల్లడించారు. ఈ బాధితుడికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రివ్యూ పేరుతో పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది.
ఐదు టాస్కులు పూర్తి చేసాక
Travelling-boost--99.com లో బాధితుడు రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ వెబ్సైట్ ద్వారా బాధితుడికి ఐదు టాస్కులు వచ్చాయి. వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 866 రూపాయలు ప్రాఫిట్ బాధితుడికి లభించింది. ప్రతిసారి బాధితుడు ఇన్వెస్ట్ చేసిన ప్రతి దానికి సంబంధించిన నగదు ఆన్లైన్ వాలెట్లో డిస్ప్లే అయ్యేది. ఆన్లైన్ విండోలో చూపించిన నగదును మాత్రం బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదు. వారిని పూర్తిగా నమ్మిన బాధితుడు మొత్తం 28 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. అనంతరం బాధితుడు వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా బాధితుడు పోగొట్టుకున్న 28 లక్షల రూపాయలు ఆరు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు.
ప్రధానంగా రాధిక మార్కెటింగ్ పేరుతో ఉన్న అకౌంట్లోకి ముందుగా డబ్బుంతా ట్రాన్స్ఫర్ అయ్యేది. ఆ తర్వాత అక్కడి నుండి పలు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేవారు. ఇందుకోసం ముందుగానే నిందితులు పలు బ్యాంకుల్లో అకౌంట్లను సిద్ధం చేసి ఉంచుకు న్నారు.బ్యాంకు అకౌంట్లో పాటు షెల్ అకౌంట్లు రెడీగా ఉంచుకున్నారు. ఈ రాధిక మార్కెటింగ్ అకౌంటు హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ మున్వర్ మైంటైన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం అకౌంట్లను అహ్మదాబాద్ కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి మెయింటెయిన్ చేసేవాడు. ఈ మొత్తం ఫ్రాడ్ లో చైనాకు చెందిన లు ల్యో, నాన్ యే, కెవిన్ జూన్ లు ప్రధాన నిందితులు గా ఉన్నారు. ఈ వ్యవహారాన్ని అంతా నడిపిస్తున్న చైనా ముఠా
ఒక్కో అకౌంట్ ఓపెన్ చేసినందుకు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇలా ఒక్క ప్రజాపతే 65 అకౌంట్లను ఓపెన్ చేయించి చైనీయులకు అప్పగించాడు. వీటి ద్వారా సుమారు 125 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిగాయి. ఇతర అకౌంట్ ల నుండి మరో 584 కోట్ల రూపాయల నగదు బదిలీ జరిగింది. నిందితుల నుంచి 17 మొబైల్ ఫోన్లు రెండు లాప్టాప్ లు 22 సిమ్ కార్డులు, నాలుగు డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని సిపి తెలిపారు.
గత ఏడాది మహేష్ బ్యాంకు కు సంబంధించిన కేసులో.. రోజుకి 20 నుండి 30 కి పైగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదు అవుతున్నాయని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో చైనాకు సంబంధించిన వాళ్ళు ప్రధాన నిందితులుగా ఉన్నారని తెలిపారు. టెలిగ్రామ్, వాట్సాప్ లో ద్వారా ఇన్విస్టిమెంట్ ఫ్రాడ్ లకు పాల్పడుతు న్నారు. 15 వేల మంది మోసపోయారని, ఒక్కొక్కరు 5 లక్షల వరకు మోసపోయారని పేర్కొన్నారు. ఒక్కో టాస్క్ లో అమౌంట్ పెట్టమని చెప్పి ముందుగా నమ్మించడానికి భారీ లాభాన్ని చూపిస్తారు. ఇలా ఏడు, ఎనిమిది టాస్క్ ల తరువాత అసలు విషయం చెబుతారు. టాస్క్ మధ్యలో నుంచి వెళ్ళడానికి ఉండదు. మధ్యలో వదిలేస్తే మొత్తం అమౌంట్ రాదు అని చెప్పి వారిని నమ్మించి దారుణంగా మోసాలకు పాల్పడుతున్నారని, నిన్న ఒక్కరోజే 15 ఇన్విస్టిమెంట్ ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయని వివరించారు.
సాఫ్ట్ వేర్ ఉద్యోగులే అధికం
ఓ వ్యక్తి 82 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి మోసాలకు బలవుతున్నవారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారన్నారు. ఎక్కువ లాభాలు వస్తాయంటూ అత్యాశకు పోయి లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీకి కన్వర్ట్ చేసుకొని నగదు తీసుకుంటున్నారు. ఆ నగదు దుబాయ్, చైనాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడి బ్యాంకుల్లో అకౌంట్ లను ఓపెన్ చేసి దుబాయ్ నుండి ఆపరేట్ చేస్తున్నారని సీపీ కూల్ టెక్, ఎయిర్ డ్రాయిడ్ యాప్ ద్వారా ఓటీపీలను తెలుసుకోవడం లావాదేవీలు జరపడం చేస్తున్నారు. శివకుమార్ అనే బాధితుడి ఫిర్యాదుతో ఈ ముఠా మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ద్వారా 28 లక్షల డబ్బు ఆరు అకౌంట్ లకు వెళ్ళింది. ఇలా హైదరాబాద్ లో పలు బ్యాంకులకు చెందిన 48 అకౌంట్ లకు 584 కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయి. ఈ మొత్తం మోసాన్ని ఒక ఫోన్ నెంబర్ పట్టించిందన్నారు. ఆ నెంబర్ హైదరాబాద్ కు చెందిన మహ్మద్ మున్వర్ దిగా గుర్తించామని హైదరాబాద్ సిపి తెలిపారు. ఇతనితో పాటు మరో ముగ్గురు కలిసి లక్నోలో షెల్ కంపెనీల పేరుతో 65 అకౌంట్ లను ఓపెన్ చేశారు
"ఆకర్షణీయంగా టాస్క్ లను తయారు చేయడంలో చైనీయులే కీలక పాత్ర వహిస్తున్నారు. చైనీయులకు అహ్మదాబాద్ కు చెందిన ప్రకాశ్ ప్రజాపతి, కుమార్ ప్రజాపతి లే నగదు లావాదేవీలు చేస్తున్నారు. వీరికి క్రిప్టో కరెన్సీ వాలెట్ ఉంది. ఈ ఇద్దరికి నగదు లావాదేవీలు జరిపినప్పుడు రెండు నుంచి మూడు శాతం కమీషన్ ఇస్తారు. దుబాయ్ అకౌంట్ లకు వెళ్ళి అక్కడి నుండి చైనావాళ్ళ అకౌంట్ లోకి వెళ్తుంది. దుబాయ్ లో ఉన్న నలుగురు ఒక్కో డాలర్ పైన పది రూపాయలు లాభం తీసుకొని చైనీయులకు పంపిస్తున్నారు. హిజ్బుల్లా టెర్రర్ మాడ్యులర్ వాళ్ళకు ఈ నగదు లావాదేవీలు జరుపుతున్న వారికి లింకులు ఉన్నాయి. ఈ మోసంలో జరిగే నగదు లావాదేవీలు డబ్బులు ఉగ్రవాదులకు వెళ్తున్నాయి. పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసంలో టెర్రరిస్టులకు లింకులు ఉన్నట్లు సమాచారం. మోసాలు చేస్తున్న గ్యాంగ్ కి టెర్రరిస్టు సంస్థలతో లింకులు ఉన్నాయి. హిజ్బుల్ టెర్రరిస్టు సంస్థతో వీళ్లకు సంబంధాలు ఉన్నాయి. ఇండియాలో వసూలు చేసిన డబ్బుని ఉగ్రవాదుల కు చేరుతున్నాయి. ప్రజాపతిని ట్రాప్ చేసి అరెస్టు చేశాము. వాట్సప్, టెలి గ్రామ్ లో ద్వారా నే కాల్స్ మాట్లాడుతాడు. దుబాయ్, చైనాకు తరుచూ ప్రయాణాలు చేస్తాడు. జూన్ 20 నా హైదరాబాద్ కు వచ్చాడు. అతను వాడే వాట్సప్, టెలిగ్రామ్ లకు సంబంధించిన ఐపి అడ్రెస్ ఆధారంగా పట్టుకున్నామని అలాగే అహ్మదాబాద్ కు చెందిన ప్రజాపతిని ముంబై లో పట్టుకున్నాం" అని సిపి అన్నారు.
NIA వాళ్ళకి కూడా ఈ కేసు గురించి సమాచారం ఇచ్చాం.హిజ్బుల్ టెర్రర్ మోడ్యూల్ కి క్రిప్టో కరెన్సీ ట్రాన్స్ఫర్ పై వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు..క్రిప్టో కరెన్సీ పై మానిటరింగ్ సిస్టం ఇంకా ఇండియాలో రాలేదు...ఈ కేసులో ప్రధాన నిందితులైన దుబాయ్, చైనా లకు చెందిన వారిని అరెస్టు చేయడం కష్టమని సిపి తెలిపారు. బ్యాంక్ లో అకౌంట్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్స్ వేరిఫికేషన్ టైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫ్రాడ్ చేసేవాళ్ళు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఈజీగా వందలకొద్ది అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు.