Pawan Kalyan : బీఆర్ఎస్‌ను తిట్టకపోవడానికి కారణం చెప్పిన పవన్
బీఆర్ఎస్ పై తాను విమర్శించకపోవడానికి కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పై తాను విమర్శించకపోవడానికి కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొత్తగూడెంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ను విమర్శించకపోవడానికి తాను ఎక్కువగా తెలంగాణలో పర్యటించలేదని ఆయన అన్నారు. ఇక్కడ పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన లేదన్నారు. తనకు అన్ని పార్టీల్లో స్నేహితులు ఉన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావుతో తనకు మంచి పరిచయాలున్నాయని, అయితే స్నేహం వేరు రాజకీయం వేరు అని పవన్ కల్యాణ‌్ అన్నారు.
డబుల్ ఇంజిన్ సర్కార్...
తాను బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన సాధ్యమవుతుందని అన్నారు. తెలంగాణలో బీసీని చేయగలిగింది ఒక్క బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణ, ఏపీల్లో ప్రతి రోజూ ఎన్నికల్లాగే పరిస్థితులు మారాయని, ఆ పరిస్థితుల్లో మార్పు రావాలని పవన్ కోరారు. ధరణి విఫలమయినట్లు ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందని అన్నారు. మోదీ పాలనలోనే సుస్థిరపాలన సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో యువత అభివృద్ధి కోసం పనిచేస్తుందన్నారు.