Telangana : నేటి నుంచి నిరవధిక సమ్మెలోకి జూడాలు

తెలంగాణ లో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. నిరవధిక సమ్మెకు నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సిద్ధమయ్యారు

Update: 2024-06-24 02:28 GMT

తెలంగాణ లో నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగనున్నారు. నిరవధిక సమ్మెకు నేటి నుంచి జూనియర్ డాక్టర్లు సిద్ధమయ్యారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. తమ డిమాండ్లను పరిష‌్కరించాలని కోరుతూ జూడాలు సమ్మెకు దిగుతున్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రతి నెలా స్టయిఫండ్ చెల్లించాలని, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్ లకు 1.25 లక్షల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని , వైద్యకళాశాలల్లో పెంచిన పదిహేను శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని అసోసియేషన్ డిమాండ్ చేసింది.

నోటీసు ఇచ్చినా...
వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నాు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ఈ నెల 18వ తేదీన సమ్మెకు సంబంధించిన నోటీసు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మెకు దిగుతున్నామని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తెలిపింది. తాము నేటి నుంచి ఓపీ సేవలతో పాటు, సర్జరీలు, వార్డ్ సేవలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర సేవల్లో మాత్రం పాల్గొంటామని అసోసియేషన్ తెలిపింది.


Tags:    

Similar News