పార్టీ వీడే నేతలతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు: కేసీఆర్

తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం

Update: 2024-03-04 14:18 GMT

పార్లమెంట్‌ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అభ్యర్థులను ప్రకటించారు. తొలి జాబితాలో నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కరీంనగర్‌కు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్‌, ఖమ్మం నామా నాగేశ్వరరావు, మహబూబూబాద్‌ స్థానానికి మాలోత్‌ కవిత పేర్లను ప్రకటించారు. నాలుగు పార్లమెంట్‌ నియోజకవర్గాలకు చెందిన నేతలతో కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికపై పలువురు నాయకుల అభిప్రాయాలను సేకరించారు. తొలి విడతలో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసింది. ఖమ్మంలో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని అన్నారు. నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలని.. పార్టీ వీడిచి వెళ్లే నేతలతో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు సమన్వయకర్తలను నియమిస్తామని.. ఎన్టీఆర్ లాంటి నేతకు రాజకీయాల్లో ఒడిదుదుకులు తప్పలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలయిందని.. కాంగ్రెస్ పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Tags:    

Similar News