Telangana : సంచలన తీర్పు.. కోటి జరిమానా
తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కోర్టును తప్పుదోవ పట్టించినపిటీషనర్ కు కోటి రూపాయల జరిమానాను విధించింది;

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. న్యాయస్థానాన్నితప్పుదోవ పట్టించినపిటీషనర్ కు కోటి రూపాయల జరిమానాను విధించింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఈ తీర్పును వెలువరించారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న విషయాన్నిదాచివేరే బెంచ్ వద్ద కు పిటీషన్ వేసి ఆర్డర్ తీసుకోవడంపై న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యాయస్థానాన్ని తప్పదోవ పట్టించేలా...
ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. ఇలా రిట్ పిటీషన్ వేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు విచారణలో పెండింగ్ లో ఉన్న సమయంలో మరొక చోట ఎందుకు పిటీషన్ వేశారంటూ తీవ్ర స్థాయిలో మందలించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న కేసులో పిటీషనర్ కు భారీ జరిమానా విధిస్తూ ఈనిర్ణయం తీసుకోవడం తెలంగాణ హైకోర్టులో సంచనంగా మారింది.