Dk Aruna : డీకే అరుణ ఇంట్లో ప్రవేశించిన ఆగంతకుడు అతడే

బీజేపీ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు;

Update: 2025-03-18 06:39 GMT
police detain intruder who entered bjp mp dk arunas house
  • whatsapp icon

బీజేపీ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. గతంలోనూ అక్రమ పలు నేరాలకు పాల్పడినట్లు రికార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. ఎందుకోసం డీకే అరుణ ఇంట్లోకి అక్రమ్ ప్రవేశించాడన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

విచారణ చేస్తున్న...
ఇటీవల తెల్లవారు జామున జూబ్లీహిల్స్ లోని డీకే అరుణ నివాసంలోకి చొరబడిన ఆగంతకుడు గంటన్నర సేపు ఇంట్లోనే ఉన్నాడు. వంటగదిలో ఉన్నాడు. అలాగే డీకే అరుణ గదిలోకి కూడా ప్రవేశించాడు.అయితే ఆ సమయంలో డీకే అరుణ లేకపోవడంతో సీసీ కెమెరాల ఫుటేజీని చూసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు.


Tags:    

Similar News