Telangana : రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది.;

రేపు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో తెలంగాణ బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించనుంది. రేపు ఉదయం 11.14 గంటలకు తెలంగాణ శాసనసభలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2025 -2026 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ బడ్జెట్ ను ఆమోదించేందుకు...
ఈ నేపథ్యంలోనే తెలంగాణ బడ్జెట్ ను ఆమోదించేందుకు మంత్రి వర్గం సమావేశం కానుంది. అయితే తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలుకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధులను కేటాయిస్తూనే, ఇచ్చిన మరికొన్నిహామీల అమలుకు సంబంధించి కూడా బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరుగుతుందని తెలిసింది.