ఖైరతాబాద్ లో కొలువుదీరిన పంచముఖి లక్ష్మీగణపతి.. నేటి నుంచి దర్శనం

బుధవారం ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను..

Update: 2022-08-31 04:59 GMT

ఖైరతాబాద్ లో ఈ ఏడాది వినాయకచవితికి పంచముఖి లక్ష్మీగణపతిని తయారు చేశారు. నేటి నుంచి పంచముఖి లక్ష్మీగణపతిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నారు. ఈ ఏడాది 50 అడుగల ఎత్తైన గణనాథుడి విగ్రహాన్ని తయారు చేశారు. పంచముఖి లక్ష్మీగణపతికి మరికొద్దిసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పూజలు చేయనున్నారు. అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా గణనాథుడిని దర్శించుకోనున్నారు.

బుధవారం ఉదయం పద్మశాలి సంఘం తరపున 50 అడుగుల జంధ్యం, కండువా, గరికమాల, పట్టువస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఈసారి స్వామివారి ప్రత్యేక పాదాలను ప్రధానవిగ్రహ సమీపంలో ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. తమిళనాడు, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. జూన్ 10 తేదీన విగ్రహ తయారీని మొదలు పెట్టగా.. విగ్రహ తయారీ పూర్తయ్యేందుకు సుమారు 2 నెలల 15 రోజుల సమయం పట్టినట్లు సమాచారం. విగ్రహ తయారీ కోసం ప్రత్యేకంగా ఒడిశా, చెన్నై ప్రాంతాల నుంచి సుమారు 100 మంది కార్మికులను పిలిపించారు.




Tags:    

Similar News