15 రోజుల్లో మునుగోడును అభివృద్ధి చేస్తారట
ఎనిమిదేళ్లుగా మునుగోడులో చేయని అభివృద్ధి పదిహను రోజుల్లో ఏరకంగా చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఎనిమిదేళ్లుగా మునుగోడులో చేయని అభివృద్ధి పదిహను రోజుల్లో ఏరకంగా చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. డిండి ప్రాజెక్టును ఇంత వరకూ ఎందుకు పూర్తి చేయలేదన్నారు. అభివృద్ధి పనులు చేస్తానంటే ఇన్నేళ్లు మీకు ఎవరు అడ్డొచ్చారని ఆయన నిలదీశారు. ఈ ఎనిమిదేళ్లలో బెల్ట్ షాపులను మాత్రం ప్రతి గ్రామంలో ఉన్నాయన్నారు. రోడ్లు వేయకుండా, బస్సులు వేయకుండా బెల్ట్ షాపులు పెడితే అభివృద్ధి జరిగినట్లేనా అని అన్నారు. ఎంఐఎం, సీపీఎం తో పొత్తు పెట్టుకుని తెలంగాణను వ్యతిరేకించాయని, వాటితోనే కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారన్నారు.
అబద్ధాలకు కేరాఫ్....
కల్వకుంట్ల కుటుంబం అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందన్నారు. పది హేను రోజుల్లో అభివృద్ధి ఎలా చేయగలరన్నారు. ఎనిమిదేళ్ల నుంచి మునుగోడును ఎందుకు పట్టించుకోలేదన్నారు. 1800 ఓట్లున్న ఒక గ్రామంలో 30 బెల్ట్ షాపులున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కల్వకుంట్ల కుటుంబం కాళ్ల కింద తాకట్టు పెట్టారన్నారు. నిన్న వచ్చిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నికోట్లు ఇచ్చి చేర్చుకున్నారో చెబితే కేసీఆర్ చెబితే బాగుండేదన్నారు. చేరికల కోసం బహిరంగంగానే బీజేపీ కమిటీ వేసిందన్నారు. మీలాగా దాచుకునే అవసరం లేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని చేర్చుకునే సంప్రదాయం టీఆర్ఎస్ కు ఉందన్నారు. మాకు నీతులు చెప్పాల్సిన పనిలేదని కిషన్ రెడ్డి అన్నారు.