మూగజీవిపై పైశాచికత్వం.. మెడకు తాడు కట్టి?

పందులకు కాపలా కోసం ఒక కుక్కను కొమురయ్య కొనుగోలు చేశాడు. దాని మెడకు వైరు కట్టి ఐదు కిలోమీటర్లు లాక్కెళ్లారు

Update: 2021-12-14 09:11 GMT

కుక్కకి ఉన్నపాటి విశ్వాసం మనుషులకు ఉండదు అనేది ఒక నానుడి. నిజంగానే కుక్క కన్నా విశ్వాసవంతంగా ఎవ్వరూ ఉండరు. అలాంటి మూగజీవి పట్ల ఓ వ్యక్తి పైశాచికత్వం ప్రదర్శించాడు. దాని మెడకు వైరు చుట్టి సుమారు 5 కిలోమీటర్ల వరకూ లాక్కెళ్లాడు. ఈ క్రమంలో కుక్కమెడకు తీవ్రగాయమైంది. ఈ ఘటనా అక్కడున్న స్థానికులను కలచివేసింది. వివరాల్లోకి వెళ్తే.. తాడ్వాయి మండలం కొండాపూర్ కు చెందిన కొమురయ్య అనే వ్యక్తి పందులను పెంచుతుంటాడు. వాటి కాపలా కోసం ఒక కుక్కను కొనుగోలు చేయాలని అనుకున్నాడు.

కుక్కను కొనుగోలు చేసి....
మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రికి వెళ్లి.. రూ.1000 ఇచ్చి ఒక కుక్కను కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి కుక్కను బైక్ పై తీసుకువచ్చేందుకు ప్రయత్నించినా.. అది సహకరించలేదు. దాంతో కుక్క మెడకు ఇనుప వైరును చుట్టి సుమారు 5 కిలోమీటర్ల వరకూ లాక్కెళ్లాడు. దారి పొడుగునా ఉన్న వాళ్లు, స్థానికులు అది చూసి.. కొమురయ్యను ఆపారు. మూగజీవి పట్ల అంత కర్కశత్వం పనికిరాదని అతడిని మందలించారు. అనంతరం స్థానికులు కుక్కను బైక్పై ఎక్కించి పంపించారు. ఈ ఘటనలో కుక్క మెడకు గాయమైంది.


Tags:    

Similar News