అసలు ఊహించని అప్లికేషన్ అది

ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి

Update: 2023-08-25 12:23 GMT

ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సిద్ధమయ్యారు. గాంధీభవన్ లో ఆయన దరఖాస్తును ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకులు అందజేశారు. ఊహించని విధంగా ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయాలని మధుయాష్కీ గౌడ్ అనుకోవడం ఊహించని పరిణామమే..!

ఎల్బీ నగర్ నియోజకవర్గం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది. 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున ఆర్ కృష్ణయ్య గెలిచారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓటమిపాలయ్యారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ముద్దగోని రాంమోహన్ గౌడ్ ఓడిపోయారు. అయితే కొద్దిరోజులకే సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. సుధీర్ రెడ్డి పార్టీ మార్పు తర్వాత.. మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. స్థానిక నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా పని చేస్తున్నారు. ఈసారి టికెట్ తమకే రావచ్చని వాళ్లు అనుకుంటున్న సమయంలో పార్టీకి చెందిన సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఎల్బీ నగర్ టికెట్ ఇవ్వాలని గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి మధుయాష్కీ గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.


Tags:    

Similar News