నేడు డీజీపీగా పదవీ విరమణ

తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది.;

Update: 2022-12-31 03:13 GMT
mahender reddy, dgp, retirement
  • whatsapp icon

తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి పదవీ కాలం నేటితో ముగియనుంది. ఈరోజు విధుల్లో చివరి దినం కవడంతో తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగే పరేడ్ లో ఆయన పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ పోలీసు అధికారులు హాజరు కానున్నారు. దాదాపు 36 సంవత్సరాల పాటు వివిధ హోదాల్లో మహేందర్ రెడ్డి తన సేవలను అందించారు.

అంజన్ కుమార్....
కాగా మహేందర్ రెడ్డికి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులో నియమించే అవకాశాలున్నాయి. ఈరోజు ఇన్‌ఛార్జి డీజీపీగా అంజన్ కుమార్ బాధ్యతలను స్వీకరించనున్నారు. అంజన్ కుమార్ తదుపరి డీజీపీగా నియమించేంత వరకూ కొనసాగనున్నారు. యూపీఎస్సీకి నుంచి పేర్లు వచ్చేంత వరకూ అంజన్ కుమార్ ను కొనసాగించనున్నారు. తర్వాత కూడా ఆయననే కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Tags:    

Similar News