Kalvakuntla Kavitha : కాసేపట్లో కోర్టుకు కవిత.. వైద్య పరీక్షలు పూర్తి కావడంతో

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.;

Update: 2024-03-16 05:34 GMT
kalvakuntla kavitha, brs mlc,  released, tihar jail
  • whatsapp icon

Kalvakuntla Kavitha :ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోనే ఆమెకు వైద్య పరీక్షలను నిర్వహించారు. మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనున్నారు. నిన్న హైదరాబాద్ లో అరెస్టయిన కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

కస్టడీ పిటీషన్ ను...
రాత్రి ఈడీ కార్యాలయంలోనే ఉన్న కవితకు ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాపేసట్లో కోర్టు ఎదుట ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించేందుకు తమకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరుపున న్యాయవాదులు కోరనున్నారు. మరోవైపు కవిత తరుపున న్యాయవాదులు కూడా కవిత అరెస్ట్ అక్రమమని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు.


Tags:    

Similar News