Hyderabad : ప్రారంభమయిన ముఖ్యమంత్రుల సమావేశం

ప్రజాభవన్ లో కొద్దిసేపటి క్రితం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమయింది

Update: 2024-07-06 12:58 GMT

ప్రజాభవన్ లో కొద్దిసేపటి క్రితం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమయింది. ప్రజాభవన్ కు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లు సాదరంగా లోనికి ఆహ్వానించారు. సమావేశానికి ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు కొందరు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

ఇవే ప్రధానంగా...
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పలు సమస్యలపై ఈ సమావేశం చర్చించనుంది. దాదాపు పథ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరు రాష్ట్రాలకు చెందకుండా ఉండిపోయాయి. దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. ఎవరు ఎంత శాతం పంచుకోవాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే విభజన తర్వాత ఖమ్మం జిల్లాలో విలీనం అయిన ఏడు మండలాలను తిరిగి తమకు అప్పగించాలని తెలంగాణ కోరనున్నట్లు తెలిసింది. అదే సమయంలో భద్రాచలం పూర్వం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది కనుక దానిని తమకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది. ఇక కృష్ణా జలాల వాటాపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. నీటి పంపకాలపై కూడా చర్చ జరగనుంది.


Tags:    

Similar News