ఈరోజు తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.;
తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఒడిశా తీరంపై కేంద్రీకృతమైన అల్పపీడనం కారణంగా రానున్న 24 గంటల్లో తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అల్పపీడనంకు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీర్లకు ఎత్తు వరకూ విస్తరించడంతో రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రేపు కూడా...
ఈ ప్రభావంతో ఈరోజు తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశముంది. రేపు కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పడతాయనుకుంటున్న సమయంలో మరో అలెర్ట్ తెలంగాణ వాసులను బెంబేలెత్తిస్తుంది. ముసురు పట్టి వారం రోజుల నుంచి ఊళ్లన్నీ నానుతున్నాయి.