తెలంగాణకు ఆరెంజ్ వార్నింగ్
తెలంగాణ కు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. రానున్న కాలంలో ఎండలు మరింత పెరుగుతాయని పేర్కొంది
రానున్న కాలంలో ఎండలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ నెలలో 40 డిగ్రీల ఉష్ఱోగ్రతలు దాటే అవకాశముందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఎండ వేడిమితో అల్లడి పోతున్నారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల నలభై డిగ్రీలు దాటేసింది.
వడగాలుల తీవ్రత.....
ముఖ్యంగా తెలంగాణ కు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పగలు పన్నెండు గంటలు దాటితే టయటకు రాకపోవడమే మంచిదని సూచించింది. అత్యధికంగా జయశంకర్ జిల్లాలోని కాటారంలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. రానున్న రోజుల్లో ఎండతీవ్రతతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశముందని హెచ్చరించింది.