మరో రెండు రోజులు భారీ వర్షాలు

అల్పపీడన ప్రభావంతో తెలంగాణాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది

Update: 2022-07-05 02:55 GMT

అల్పపీడన ప్రభావంతో తెలంగాణాలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పై ఏర్పడిన అల్పపీడీనం కారణంగా అనుంబంధ ఆవర్తనం ఏర్పడి నైరుతి దశకు తిరిగిందని అధికారులు వెల్లడించారు. దీంతో ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

అత్యధికంగా...
గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లిలో 13.2 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లాలోని పాత రాజంపేటలో 12.8 సెంటిమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర్లలో 10.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ వెల్లడించింది.


Tags:    

Similar News