Weather Report : మరో రెండు రోజులు వర్షాలు.. ఎల్లో అలెర్ట్
తెలంగాణలో రాగల రెండు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది;
Weather Report :తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాగల రెండు రోజుల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గడచిన మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు కురుస్తున్నాయి. దీంతో అనేక పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి, మొక్కజొన్న, జొన్న తదిరత పంటలకు నష్టం వాటిల్లడంతో రైతులు తల్లడిల్లిపోతున్నారు. రాగల రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు.
ద్రోణి ప్రభావంతో...
ద్రోణి ప్రభావం కారణంగా కురుస్తున్న వర్షాలు మరి రెండు రోజులు కొనసాగుతాయని వాతావరణ శఆఖ తెలిపింది. మరో రెండు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దీంతో పాటు కూడా ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. బుధ, గురువారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.