Hyderabad : హైదరాబాద్ లో కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు అతి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిచింది. నిన్న రాత్రి నుంచే హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుంది. నిన్న అర్థరాత్రి నుంచి ఉదయం వరకూ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. హై అలెర్ట్ ప్రకటించింది.
రెండు రోజుల పాటు...
నిర్మల్ భూపాలపల్లి, ములుగు, ఆదిలాాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గంటలకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయగా, మరికొన్ని జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచింది. చెప్పినట్లుగానే హైదరాబాద్ నగరంలో వర్షం ఆగకుండా కురుస్తుంది.
జీహెచ్‌ఎంసీ అధికారుల వార్నింగ్...
దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో పాటు పురాతన భవనాల భారీ వర్షాలకు నానిపోయి కూలే అవకాశముందని భావించి వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం కావడంతో అందరూ విధులకు వెళ్లాల్సి రావడంతో రహదారులన్నీ జలమయం కావడంతో అందరూ మెట్రో బాట పడుతున్నారు. మెట్రో రైళ్లు ఉదయం నుంచే కిటకిట లాడుతున్నాయి. హైదరాబాద్ నగరం భారీ వర్షంతో వణికిపోతుంది. మ్యాన్‌హోల్స్ ఎక్కడా తమకు తెలియకుండా ఓపెన్ చేయవద్దంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు.