Telangana WeatherAlert: ఐదురోజుల పాటు ఆరెంజ్ అలెర్ట్.. బయటకు వచ్చారో ఇక అంతే
తెలంగాణలో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది
Telangana WeatherAlert:తెలంగాణలో ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు చేరుకునే అవకాశముందని తెలిపింది. అనేక చోట్ల తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
ఈ జిల్లాల్లో...
ప్రధానంగా నాగర్‌కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజులు తీవ్ర వడగాలులు కూడా వీస్తాయని తెలిపింది. అలాగే ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ వంటి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఉదయం ఏడు గంటల నుంచే ఎండతీవ్రత అధికంగా ఉండనుండటంతో ప్రజలు రోడ్డు మీదకు రావడానికే భయపడిపోతున్నారు.