Rain Alert : తెలంగాణలో రెండు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. తేలిక నుంచి మోస్తరు పాటి వర్షాలు కురిసే ఛాన్సు ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణం కూడా చల్లబడుతుందని, చలిగాలులు బలంగా వీస్తాయని చెప్పింది.
కొన్ని చోట్ల...
నిన్న కొన్ని చోట్ల వర్షాలు కురిశాయి. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షం నమోదయింది. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేటలో అత్యధికంగా 5.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈరోజు, రేపు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.