ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్... భారీ వర్షాలు
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరించింది.;
మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరించింది. రెడ్ అలర్ట్ చేసింది. సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల వాసులను అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. చెరువులన్నీ నిండిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క ఈ నెలలోనే సాధారణ వర్షపాతం కంటే రెండింతల వర్షపాతం నమోదయింది.
మరో మూడు రోజుల పాటు...
తెలంగాణలోని జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసింది. సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాకు రెడ్ అలర్ట్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం బలపడటంతో మరో రెండు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.