భారీ వర్షాలు... అధికారుల హెచ్చరిక

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2022-07-10 03:07 GMT

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయిమయ్యాయి. నిన్న నిర్మల్ జిల్లా ముథోల్ లో 20.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇంత భారీ స్థాయిలో వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. భారీ వర్షం కారణంగా నిర్మల్ జిల్లాలోని భైంసా మండలం దేగాం వద్ద పెద్ద వంతెనపై వాగు పొంగి ప్రవహించడంతో భైంసా - బాసర ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

లోతట్టు ప్రాంతాలు....
భారీ వర్షాలతో రహదారులు కోతకు గురయ్యాయి. కొన్ని చోట్ల విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది పొంగి ప్రవహిస్తుంది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో నిన్న, ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.


Tags:    

Similar News