Owaisi : కొత్త చట్టాలపై ఒవైసీ ఏమన్నారంటే?
కొత్త చట్టాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
కొత్త చట్టాలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కొత్త చట్టాలతో సామాన్య ప్రజలకు న్యాయం జరగదని ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఐపీసీ, సీఆర్పీసీని బ్రిటిష్ చట్టాలనడం సరికాదని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గతంలో సామాన్యులు ఫిర్యాదుచేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని అసద్ అన్నారు.
పదిహేను రోజుల వరకూ...
అయితే కొత్త చట్టాలతో ఫిర్యాదు చేసిన పదిహేను రోజుల వరకు ఎఫ్‌ఐఆర్‌పై నిర్ణయం తీసుకోలేరు. నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదయిందా లేదా అనేది కూడా..పోలీసులు చెప్పే పరిస్థితి లేదని హైదరాబాద్ పార్లమెంటు సభ్యుదు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చట్టాల వల్ల సామాన్యులకు ఇబ్బందులు తప్పించి ఒనగూరే ప్రయోజనం లేదన్నారు.