హ్యాట్రిక్‌పై హరీష్ రావు 'ధీమా'

ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. తెలంగాణ‌ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని

Update: 2023-08-11 15:27 GMT

ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. తెలంగాణ‌ రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు ధీమా వ్య‌క్తం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో బీసీ బంధు పథకం లక్ష రూపాయల గ్రాంట్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్ రావు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం భూమి అమ్ముకుంటే తెలంగాణలో ఐదు ఎకరాలు దొరికేది.. నేడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో ఐదు ఎకరాలు దొరికే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారన్నారు. ఇది బీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు.

గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని.. డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్‌లో వాల్ల గొడవలు వాళ్లకే తప్ప ప్రజల బాధలు పట్టవని విమ‌ర్శించారు. బీజేపీకి బలం లేదు.. కాంగ్రెస్‌కు అభ్య‌ర్ధులు లేరు.. బీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్నారు. ఒకప్పుడు గతుకుల గజ్వేల్ ..ఇప్పుడు బతుకుల గజ్వేల్‌గా మారింది. గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్ వచ్చిందని అన్నారు. గెలిపించినందుకు గజ్వేల్ ప్రజల రుణం కేసీఆర్ తీర్చుకున్నారని.. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ ఇచ్చి కేసీఆర్ రుణం తీసుకోవాలని గ‌జ్వేల్ ప్రజలను కోరారు.


Tags:    

Similar News