కుక్కల దాడిపై కేటీఆర్ రెస్పాన్స్

అంబర్ పేట్ లో వీధికుక్కల దాడిలో బాలుడి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది బాధాకరమైన సంఘటన అని కేటీఆర్ అన్నారు

Update: 2023-02-21 07:36 GMT

అంబర్ పేట్ లో వీధికుక్కల దాడిలో బాలుడి మృతిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది బాధాకరమైన సంఘటన అని కేటీఆర్ అన్నారు. బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

చర్యలు తీసుకుంటాం...
నగరంలో కుక్కల బెడదకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బాలుడి కుటుంబానికి తన సానుభూతిని కేటీఆర్ తెలియచేశారు. మృతి చెందిన బాలుడిని వెనక్కు తీసుకురాలేకపోయినా, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామన్నారు.


Tags:    

Similar News