విపక్షాల ఛార్జిషీట్లపై మంత్రి పొన్నం ఏమన్నారంటే?
బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇచ్చిన ఛార్జిషీట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు
బీఆర్ఎస్, బీజేపీ కాంగ్రెస్ ఏడాది పాలనపై ఇచ్చిన ఛార్జిషీట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. విపక్షాలిచ్చింది ఛార్జ్‌షీట్లు కాదు..రిప్రజెంటేషన్ అని ఆయన అన్నారు. జేపీ, బీఆర్‌ఎస్ వేరు కాదు మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. విపక్షాల రిప్రజెంటేషన్‌ను కూడా పరిశీలిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రెండు పార్టీలూ కలసి...
అయితే రెండు పార్టీలూ కలసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు యత్నిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని ఆయన పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిలోపే పర్జలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని అన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.