Praneeth Hanumantu: వారిపై సీతక్క సీరియస్
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇటీవల తండ్రీ కుమార్తెల బంధంపై అనుచితమైన
యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఇటీవల తండ్రీ కుమార్తెల బంధంపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకు తీవ్ర విమర్శలను ఎదుర్కోవడమే కాకుండా అధికారులు వారిపై చర్యలకు ఉపక్రమించారు. టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా దీన్ని ఖండిస్తూ పోస్టు పెట్టగా.. ప్రణీత్‌పై తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్‌బి)లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. సాయి ధరమ్ తేజ్ పోస్ట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ప్రణీత్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. తనపై కావాలంటే ఆగ్రహం వ్యక్తం చేయండి.. దయచేసి నా కుటుంబాన్ని దీని నుండి వదిలివేయండని కోరారు.
తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మంత్రి సీతక్క స్పందించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని కొంత మంది నీచులు వక్రీకరించడం దారుణమని.. సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయి వాగుతున్న దుర్మార్గులపై కేసు నమోదు చేశామన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.