గవర్నర్ కు కవిత స్ట్రాంగ్ కౌంటర్
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు;
గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో సెంట్రల్ విస్టా మీద కంటే దేశంలో మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలన కోరారు. కేవలం కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టకూడదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.
వారి కోసమే ...
రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించు కోవడం కోసమే తమ పోరాటం అని కల్వకుంట్ల కవిత అన్నారు. రిపబ్లిక్ డే లాంటి ప్రత్యేక మైనరోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్ కు ధన్యావాదాలని కవిత ట్విట్టర్ లో సెటైరికల్ గా పోస్టు చేశారు.