సుఖేష్ ఎవరో నాకు తెలియదు
బీఆర్ఎస్ పై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం జరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సుఖేష్ ఎవరో తనకు తెలియదన్నారు;
బీఆర్ఎస్ పార్టీపై ఉదేశ పూర్వకంగా దుష్ప్రచారం జరుగుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ ని ఎదుర్కునే ధైర్యం లేఖ తన మీద దాడి ఫేక్ చాట్ లతో ప్రచారం చేస్తున్నారన్నారు. సుఖేశ్ తో తనకు ఎలాంటి పరిచయము లేదన్న కవిత గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ మీద, మరీ ముఖ్యంగా తన మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని పేపర్లు, టీవి ఛానెళ్లు, యూ ట్యూబ్ మీడియాల ద్వారా పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నాయని కవిత అన్నారు. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం, దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాని తదనంతరమే ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్ లో భాగంగా పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారన్నారు.