నన్ను బీజేపీలోకి రమ్మన్నారు... కానీ?
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలో చేరాలని కొందరు కోరారని ఆమె చెప్పారు
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను బీజేపీలో చేరాలని కొందరు కోరారని ఆమె చెప్పారు. మీడియా సమావేశంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ వారి ప్రతిపాదనను తిరస్కరించానని తెలిపారు. బీజేపీలోని కొందరు స్నేహితులు, అనుబంధ సంఘల నేతలు ప్రతిపాదనలు తెచ్చాయని అన్నారు. కానీ అందుకు తాను అంగీకరించలేదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
బ్యాక్ డోర్ నుంచి....
ప్రజలను, నాయకుడిని మోసం చేయబోనని తెలిపారు. స్వంత శక్తితోనే నాయకులం అవుతామని వారితో చెప్పానని అన్నారు. బ్యాక్ డోర్ నుంచి నేతలను కాబోమని తెలపిారు. ప్రజల్లోనే ఉంటామని, అన్నీ ఎందుర్కొంటామని ఆమె అన్నారు. షిండే తరహాలో తెలంగాణలో ఇక్కడ చేయాలని చూశారని ఆమె అన్నారు. అలాంటి వ్యవహారాలు తన వద్ద పనిచేయవని, కేసీఆర్ వెంటే నడుస్తానని, తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోనని ఆమె అన్నారు.