నేడే ప్రధాని మోదీ రాక.. ఆ ఆంక్షలను గుర్తుపెట్టుకోండి

మోదీ పర్యటన సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

Update: 2023-07-08 02:21 GMT

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓరగల్లు పర్యటనకు రానున్నారు. శనివారం ఉదయం 7.35కు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ప్రధాని. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌స్ట్రిప్‌లో దిగుతారు. భద్రకాళి దేవాలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి హన్మకొండ ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.

మోదీ పర్యటన సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. హైదరాబాద్, ఖమ్మం, హుజురాబాద్, ములుగు ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక సూచనలు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 4 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి. హుజురాబాద్ వైపు నుండి హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం, ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుంది. పర్కాల, ములుగు మార్గాల నుండి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు వెళ్లాల్సి ఉంటుంది.
వర్ధన్నపేట నుండి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పర్కాల, భూపాలపల్లి వెళ్లే వాహనాలు పున్నేలు క్రాస్ నుండి డైవర్షన్ తీసుకోని.. ఐనవోలు, కరుణాపురం ఓఆర్ఆర్ మీదుగా పంపిస్తారు. నర్సంపేట నుండి హైదరాబాద్, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్ జంక్షన్, దేశాయిపేట్ 80ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమన్ జంక్షన్, పెద్దగడ్డ, కేయూ జంక్షన్, చింతగట్టు ఓఆర్ఆర్ మీదుగా డైవర్ట్ చేశారు.
హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు వచ్చే వాహనాలు.. హుజురాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ.ఈ మైదానంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. పర్కాల, భూపాలపల్లి, ములుగు నుండి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ డైవర్షన్ నుండి కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ.ఈ మైదానంలో పార్కింగ్ చేసుకోవచ్చు. నర్సంపేట వైపు నుండి వచ్చే వాహనాలు వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్, జంక్షన్, దేశాయిపేట్ 80 ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమన్ జంక్షన్, పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్,100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ. ఈ మైదానంలో వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి.


Tags:    

Similar News