Nagarjuna Sagar : నాగార్జున సాగర్ కు జలకళ... పోటెత్తుతున్న వరద
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటిపారుదల శాఖ అధికారులు గేట్లు ఎత్తారు. ఇప్పటికే 26 గేట్లను నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఎత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇరవై రెండు గేట్లు ఐదు అడుగులు, నాలుగు గేట్లు పది అడుగులు ఎత్తిన అధికారులు దిగువకు నీరును విడుదల చేస్తున్నారు.
సందర్శకుల తాకిడి...
ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 2.47 లక్షల క్యూసెక్కులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 586.70 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్ పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 303.94 టీఎంసీలుగా ఉంది. 26 గేట్లు ఎత్తి వేయడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సాగర్ అందాలను తిలకిస్తున్నారు.