ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోలింగ్ పర్సంటేజీ ఎంతంటే?

నల్లగొండ -ఖమ్మం- వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది

Update: 2024-05-28 03:55 GMT

నల్లగొండ -ఖమ్మం- వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. పెద్దయెత్తున ఓటర్లు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 72.37 పోలింగ్ శాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. అధికారికంగా ఈ ప్రకటనను విడుదల చేయడంతో ఈ ఎన్నికల్లో భారీగానే ఓటింగ్ జరిగినట్లు అర్థమవుతుంది.

ప్రశాంతంగా...
పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో నల్లగొండ -ఖమ్మం- వరంగల్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమయింది. అయితే నిన్న జరిగిన పోలింగ్ ప్రశాతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. బ్యాలట్ పేపర్ లో ఓటును వినియోగించుకునే దానిపై ఓటర్లకు అవగాహన కల్పించారు. జూన్ 5వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.


Tags:    

Similar News